Great Father: నాన్న అందరికీ తానో ఓ ఎమోషన్.. తాను ఎన్ని కష్టాలు పడినా తన పిల్లలు సుఖంగా ఉండాలనుకునే వ్యక్తి. తను బతికంత కాలం పిల్లలకు ఓ ఆపద రాకుండా కాపాడే రక్షణ కవచం. నాన్నంటే కేవలం బాధ్యతే కాదు.. భరోసా కూడా. తన పిల్లలకు ఏదీ కావాలో, వారు ఏంఆశిస్తున్నారో వాళ్లు చెప్పకుండానే తెలుసుకుని వారి ఇష్టాలను తీర్చుతాడు. ఈ క్రమంలోనే తండ్రీకూతుళ్లు కలుసుకున్న ఎమోషనల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక కూతురు తన తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తూ కనిపించింది.
►ఈ తండ్రీకూతుళ్ల ఆప్యాయతానురాగాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది
►షృత్వా దేశాయ్ గ్రాడ్యుయేషన్ కోసం కెనడా వెళ్లింది. స్థానికంగా ఓ షాపులో పనిచేస్తూ చదువు కొనసాగిస్తోంది
►విదేశాలకు వెళ్లి ఏడాదిన్నరైనా ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆమె తండ్రే అక్కడికి వెళ్లాడు. pic.twitter.com/sBJlFaPRyI— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 26, 2023
షృత్వా దేశాయ్ గ్రాడ్యుయేషన్ కోసం కెనడా వెళ్లింది. విదేశాలకు వెళ్లి ఏడాది అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి స్వయంగా కెనడా వెళ్లి కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తూ చదువుకుంటుంది. పని చేసే చోట అకస్మాత్తుగా ఎదురుగా తండ్రి కనిపించడంతో షాక్ అయింది. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని ఆనందబాష్పాలతో నిశ్చేష్టురాలైంది. దగ్గరకు వెళ్లిన తండ్రి ఆప్యాయంగా బిడ్డను హత్తుకొని కన్నీరుమున్నీరు అయ్యాడు. ‘‘నాన్నను చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగి నంత పనైంది. ఆనందంతో ప్రాణం లేచివచ్చినట్లనిపించింది. నన్ను చూసేందుకు దేశాలు దాటి ఇంతదూరం వచ్చారా? ఈ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. ఇలాంటి తండ్రి ఉన్నందుకు గర్విస్తున్నా’’ అంటూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.