దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో దిల్సుఖ్నగర్లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై NTV తో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల బాధిత కుటుంబాలు తమ ఆవేదనను పంచుకున్నాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు ఇచిన తీర్పుపై మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
Also Read:Supreme Court: తమిళనాడు గవర్నర్కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
నిధితులకు మరణశిక్ష విధించడం న్యాయస్థానంపై మరింత గౌరవం పెరిగింది.. కానీ ఇన్ని రోజులు సుదీర్ఘంగా విచారణ చేపట్టడం మాకు బాధ కలిగించింది.. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు కోర్టులు త్వరితగతంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష ముమ్మాటికి సరైనదే.. 2013లో జరిగిన భయానక ఘటన ఇంకా మా కండ్ల ముందు తిరుగుతూనే ఉంది.. మమ్మల్ని భయం ఇంకా వెంటాడుతూనే ఉంది..
Also Read:Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 15 రోజులకే భర్తకు దిమ్మతిరిగే షాకిస్తూ..
మమ్మల్ని బాధిత వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి.. గతంలో సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.. 2013 లో కాంగ్రెస్ మాకు ఆర్ధికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది.. కానీ, నెరవేర్చలేదు.. మా కుటుంబ సభ్యులు కొందరు కాళ్లు చేతులు తెగిపోయి చెవులు వినబడక ఇంకా మంచం పైనే ఉన్నారు.. వెంటనే నిందితులను ఉరితీసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామని వెల్లడించారు.