గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా విమర్శించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం యొక్క రాజ్యాంగ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
READ MORE: Pune: పూణె-బెంగళూరు హైవేపై వోల్వో బస్సు దగ్ధం.. ప్రాణభయంతో దూకేసిన ప్రయాణికులు
రాజ్యాంగం ఆర్టికల్ 145(3) కింద చట్టాన్ని అర్థం చేసుకునే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇస్తుందని, కానీ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు. “రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి” అని ఉపాధ్యక్షుడు అన్నారు.
READ MORE: Andhra to Andhra via Telangana: ఆంధ్రా to ఆంధ్రా వయా తెలంగాణ.. గళమెత్తిన కూటమిలోని మరో ఎమ్మెల్యే..!
కాగా.. రాష్ట్ర గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆపి ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై తాజాగా ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
Tags: