NTV Telugu Site icon

Venky Kudumula: డైరెక్టర్ ఇంట విషాదం.. దయచేసి ఆ పని చేయకండి అంటూ ట్వీట్

Venky

Venky

Venky Kudumula: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కజిన్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోవిడ్ తరువాత వచ్చే జ్వరాన్ని నార్మల్ గా తీసుకోవద్దని ఆయన వేడుకున్నాడు. అలా సాధారణ జ్వరమే అనుకోని నిర్లక్ష్యం చేయడం వలనే తన కజిన్ ను దూరం చేసుకున్నామని ఎమోషనల్ అయ్యాడు. ” నా కజిన్‌కి రెండు వారాలుగా జ్వరం వచ్చింది. కానీ అది కేవలం ఫీవర్‌గా భావించి సమయానికి డాక్టర్ వద్దకు వెళ్లలేదు. నిర్లక్ష్యం చేశాడు. కానీ.. ఆ జ్వరం GB సిండ్రోమ్ అని పిలువబడే అరుదైన వ్యాధిగా మారింది. మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం ఈ సిండ్రోమ్ పని. ఇక ఈ వ్యాధి తరువాత అతని ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఇది మొదట గుర్తించి సమయానికి చికిత్స చేస్తే నయమవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. కానీ, వైద్యం నిర్లక్ష్యం చేయడం వలన అతని జీవితం కోల్పోయాడు. కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాడు.

Sudigali Sudheer: బ్రేకప్ బాధలో సుధీర్.. ఏడిపించేశాడు

కోవిడ్ తర్వాత, ఏ జ్వరం కేవలం జ్వరం కాదు.. మీ శరీరం సరైన స్థితిలో లేనప్పుడు, అది జ్వరం, అనారోగ్యం లేదా కొన్ని రకాల అసౌకర్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి, వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించండి. దయచేసి కాలానుగుణ ఆరోగ్య పరీక్షల కోసం సమయాన్ని వెచ్చించండి, ఏదైనా తప్పు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం వైపు ఒక చిన్న అడుగు జీవితాలను, కుటుంబాన్ని కోలుకోలేని నష్టం నుండి కాపాడుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. వెంకీ కుడుముల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నితిన్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.