Site icon NTV Telugu

Aadarsha-Kutumbam: ‘ఆదర్శకుటుంబం’ పై లేటెస్ట్ అప్ డేట్..

Adarsha Kutumbam

Adarsha Kutumbam

తెలుగు వెండితెరపై ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలతో అందరినీ అలరించిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ జతకడుతుకటబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 77వ చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No. 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, త్రివిక్రమ్ మార్క్ చురుకైన డైలాగులు, వెంకటేష్ అద్భుతమైన టైమింగ్‌తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.

Also Read : Suriya – Jyotika: ఆమె లేకపోతే పెళ్లే వద్దన్నాడు.. సూర్య లవ్ స్టోరీలో అసలు నిజాలు చెప్పిన తండ్రి శివకుమార్!

మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2026 వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు. ఈ భారీ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల నాలుగో వారం నుంచి ఈ ఇంట్లో షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ షూట్ అనంతరం విదేశాల్లో సాంగ్స్ షూటింగ్ ను జరుపుకోనున్నారు. కేవలం పాటల కోసం మాత్రమే విదేశాలకు చిత్రబృందం వెళ్తుందట.అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version