Site icon NTV Telugu

Adarsha Kutumbam Update: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గురూజీ సినిమాపై క్రేజీ రూమర్!

Adarsha Kutumbam

Adarsha Kutumbam

Adarsha Kutumbam Update: ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ కొన్ని చిత్రాలు అలా మెదులుతూనే ఉంటాయి.. అలాంటి సినిమాలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయంటే అతిశయోక్తికాదు. ఈ సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ రైటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి అందరినీ అలరించిన సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా వస్తు్న్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No. 47). ఈ సినిమాపై ప్రేక్షకులల్లో మంచి హైప్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల ప్రభావం, వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, గురూజీ అదిరిపోయే డైలాగ్స్ కోసం, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

READ ALSO: ISIS Uranium Plan: 1,000 టన్నుల యురేనియం కోసం ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్!

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో వెంకీ మామా సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం గురించి ఏ అప్డేట్స్ వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక క్రేజీ రూమర్స్ జోరుగా ప్రచారం అవుతుంది. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని సమాచారం. వాటికి తగ్గట్టుగా సెకండ్ హాఫ్‌లో వెంకీ మామా పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ‌ను ప్లాన్ చేశారని టాక్ నడుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌ను షూట్ చేయడానికి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారని సమాచారం. ఈ భారీ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం 2026 వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

READ ALSO: Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!

Exit mobile version