NTV Telugu Site icon

GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..

Kolkata

Kolkata

GT vs KKR: ఐపీఎల్ సీజన్‌ 16 లో భాగంగా గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. యశ్‌ దయాల్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ పట్టడంతో కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో దయాల్‌ షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో గుర్భాజ్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌కు చేరాడు. 28 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జాషువ లిటిల్‌ బౌలింగ్‌లో అభినవ్‌ మనోహర్‌కు క్యాచ్‌ ఇచ్చి జగదీశన్‌ (6) ఔటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో వెంకటేశ్ అయ్యర్(47), నితీష్ రాణా(30) ఉన్నారు. వెంకటేశ్‌ అయ్యర్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టు విజయం కోసం పోరాడుతోంది. కోల్‌కతా గెలవాలంటే 53 బంతుల్లో 102 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్‌ బౌలర్లు మహ్మద్ షమీ, జోషువా లిటిల్ తలో వికెట్ తీశారు.

Show comments