NTV Telugu Site icon

Sankranthiki Vasthunam Twitter Review: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విట్టర్ రివ్వూ.. బ్లాక్ బస్టర్ పొంగలే!

Sankranthiki

Sankranthiki

Sankranthiki Vasthunam Twitter Review: ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. వెంకీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అనిల్ డెరెక్షన్ తోడైతే థియేటర్లలో ప్రేక్షకుల పొట్టలు చెక్కలవుతాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి 2025 కానుకగా నేడు సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఫాన్స్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

Also Read: Akhanda 2: కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ‘మొదటి పార్ట్ కామెడీ అదిరిపోయిందని, రెండో భాగం బాగుందని ట్వీట్స్ చేస్తున్నారు. వెంకటేశ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ అని ఫాన్స్ కొనియాడుతున్నారు. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పొంగలే అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ బాగుందని, ఈ పండక్కి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను అడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read: Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్..

‘వెంకీ, రావిపూడి కాంబినేషన్లో మరో హిట్. వీళ్ళు సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాతో వచ్చిన ప్రతీసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే పర్ఫెక్ట్. ఓపెనింగ్స్ అనిల్ కేవలం డైరక్టర్ యే కాదు, సినిమాను తన భుజాల మీద మోసి జనాల్లోకి తీసుకెల్లిన క్రియేటివ్ జీనియస్’ అని ఓ నెటిజెన్ ట్వీట్ చేశాడు. ‘అనిల్ రావిపూడి, విక్టరీ వెంకీ.. నవ్వించడంలో వీరిద్దరు మాస్టర్ డిగ్రీలు చేసేసారు’ అని మరొకరు ట్వీటారు. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వెంకీ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే.