NTV Telugu Site icon

Venkaiah Naidu: నిజాయితీగా పని చేస్తే దేశం అభివృద్ది చెందుతుంది..

Venkaih Naidu

Venkaih Naidu

నెల్లూరు ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాల..మెడికల్ కాలేజీగా అభివృద్ధి చెందటం సంతోషం కలిగిస్తోంది అని పేర్కొన్నారు. మా అమ్మాయి దీపావెంకట్ కూడా ఇదే ఆసుపత్రిలో జన్మించింది.. పౌరులు నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా పనిచేస్తే దేశం అభివృద్ది చెందుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ, వైద్య వృత్తిలో ఉన్నవారంతా అంకితభావంతో సేవలు అందించాలి.. రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే కోరుకున్నారు.. ఏ దేశమైనా శక్తివంతంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పారు. దేశ ప్రజల్లో 60 శాతం మంది గ్రామాల్లో ఉన్నారు.. వైద్యులందరూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం కొంత సమయమైనా పని చేయాలి అని వెంకయ్యనాయుడు కోరారు.

Read Also: Haryana: వామ్మో.. ఎంతగా బరితెగించేశారో..!

జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల అనారోగ్యాలు పెరుగుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రజలు దేవుడి తరువాత వైద్యులను దేవుడిలా భావిస్తారు.. అందరి జీవితం స్వచ్ఛంగా ఉండాలి.. మన ఇళ్లు, గ్రామం శుభ్రంగా ఉంచుకోవాలి.. అందుకోసమే మన ప్రధాని స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. జర్మనీ, రష్యా, చైనా వంటి దేశాలు మాతృ భాషలోనే విద్యాభోధన సాగిస్తున్నాయి.. మన ప్రభుత్వాలు కూడా మాతృ భాషకి ప్రాధాన్యమివ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపాలి.. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నవారు ఉన్నతస్థానాలలో ఉన్నారు.. బాగా సంపాదించి, సొంత ప్రాంతాల అభివృద్దికి తోడ్పడుతున్నారు.. ఇంట్లోనే వంట చేసుకోవాలి.. ఆడవారే వంట చేయాలని ఏమీ లేదు.. మగవారు కూడా వంట చేయడంలో తప్పులేదన్నారు. పాతకాలం నాటి మిల్లెట్స్ వంటకాలు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ దొరుకుతున్నాయి.. వైద్యం కూడా కమర్షియల్ అయిపోయింది.. ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ వచ్చేశాయి.. అవసరమైన పరీక్షలే చేయించి, అవసరమైన మందులు ఇవ్వాలి అని వెంకయ్య నాయుడు సూచించారు.