Site icon NTV Telugu

Venkaiai Naidu : పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలి

Venkaiah Naidu

Venkaiah Naidu

పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలన్నారు భారతమాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయడు. విశాఖ ఐటీ హిల్స్‌లో కార్పొరేట్ బిజినెస్ కాన్ క్లేవ్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ హెడ్స్ కనెక్ట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షేర్ అండ్ కేర్ అనేది భారతీయ తత్వమని, సంపద సృష్టించాలి…దాన్ని పంచడంలో వుండే ఆనందాన్ని కూడా పొందాలన్నారు. సంపద పెంచుకోకుండా పంచుకుంటూపోతే అప్పులకు వడ్డీలు కట్టాలని ఆయన అన్నారు. అవసరార్ధులకు చేయి అందించాలి.. భుజం ఎక్కించి మోయకూడదని ఆయన అన్నారు.

Also Read : Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు

మూడో అతిపెద్ద ఆర్ధికశక్తిగా భారత్ అవతరిస్తుందని, ప్రకృతిపరిరక్షణ పైనే భవిష్యత్తు ఆధారపడి వుందన్నారు వెంకయ్య నాయుడు. సహజవనరులను , నదులను, జలవనరులను దెబ్బతీసుకోవడం మంచిదికాదని ఆయన అన్నారు. ప్రకృతి ని పరిరక్షించడంలో పారిశ్రామిక వేత్తలే ముందుండాలన్నారు. నైతిక విలువలు, వ్యాపారంలోనూ , రాజకీయాల్లోనూ కనుమరుగవుతున్నాయని, G-20 ఫోరం పర్యావరణాన్ని కాపాడేందుకు , సమాజహితానికి సహకరించుకునేందుకు దోహదపడాలన్నారు. ట్రెండ్ సెట్టర్లు గా మన వాళ్లు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని వెంకయ్య నాయుడు అన్నారు.

Also Read : Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే

Exit mobile version