బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు అని ఆరోపించారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఈడి కేసులు అంటేనే.. నేడు ఓ జోక్ అయిపోయిందని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం మొత్తాన్ని దోచుకుంటున్నది బీజేపీ.. అసలు ఈడీ కేసులు పెట్టాల్సింది బీజేపీ మీదనే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు తనను తిడితే పెద్దవాళ్లమై పోతామని భ్రమపడుతున్నారని అన్నారు.
Also Read : Black Heads: ముఖంపై నల్లటి మచ్చలున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే!
ప్రతిపక్షాలు ఎంత తిడితే ప్రజల్లో మాకు అంత పాజిటివ్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. ప్రజలు ఇలాంటి విషయాలన్నింటినీ గమనిస్తున్నారని.. అంతిమంగా ఎవరు కావాలో నిర్ణయించేది వారేనని అన్నారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి గడిచిన ఎనిమిదేండ్లలోనే జరిగిందని..అప్పటి కన్నా ఒక రూపాయి ఎక్కువే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు ఇక్కడ ఎవరికీ చోటులేదని, ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ,బీజేపీని తిరస్కరించారని అన్నారు. దమ్ముంటే తెలంగాణ పథకాలను మొదలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపాలని మంత్రి వేముల వ్యాఖ్యానించారు.
Also Read : Avinash Reddy : అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే..!
