NTV Telugu Site icon

Vellampalli Srinivas : బోండా ఉమా రాయి దాడిపై రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నాడు

Vellampally

Vellampally

విజయవాడ సీఎం జగన్‌పై రాయి దాడి కేసుపై వెలంపల్లి శ్రీనివాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా జగన్ పై దాడి చేయించారన్నారు. మొదట్లో వన్ టౌన్ నుంచి రౌడీ షీటర్లను తెచ్చి రాళ్ళు వేశామన్నాడు బోండా అని ఆయన ఆరోపించారు. బోండా ఉమా రాయి దాడిపై రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాయి దాడి మూలాలు బోండా ఉమా ఆఫీసు చుట్టు తిరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అధికారంలోకి వస్తామని పోలీసులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, బీసీలను దాడులకు చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..

బోండా ఉమా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయం దగ్గరపడటంతో మందులు వేసుకుని ప్రచారం చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సతీష్ తండ్రిని ఉమా ఇంటికి పిలుపించుకుని లావాదేవీలు, రాయబారాలు నడుపుతున్నాడని, బోండా ఉమా ఆయన కుమారులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని, ఎన్నికల తర్వాత బోండా ఉమా బెదిరింపుల సంగతి చూస్తానన్నారు. దాడి జరిగే సమయానికి బోండా ఉమా, దుర్గారావు ఒకేచోట ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌పై బురదజల్లె ప్రయత్న చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలే ఆయన్ను మరోసారి గెలిపిస్తాయని ఆయన అన్నారు.

Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు