Vellampalli Srinivas: చంద్రబాబు ప్రభుత్వానికి లడ్డూ విషయంలో తప్పు చేశామని బాధ పడే పరిస్థితి కనిపించటం లేదని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అధికారంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు దేవుడి విషయంలో సిగ్గు, భయం లేకుండా మాట్లాడుతున్నారు.. గత ఏడాది సెప్టెంబరులో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు.. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీక్ష అంటూ నానా యాగీ చేశారు.. సీబీఐ సిట్ ఎక్కడా యానిమల్ ఫ్యాట్ ఆనవాళ్లు లేవని రిపోర్ట్ ఇచ్చింది.. అయినా ఇప్పటికీ వాళ్ళు రిపోర్ట్ పై బుకాయిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని నిరూపించగలరా అని కూటమి నేతలకు మాజీమంత్రి వెల్లంపల్లి సవాల్ విసిరారు.
Read Also: Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
అయితే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేనప్పుడు, పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైతే డైవర్షన్స్ చేయటం చంద్రబాబుకు అలవాటేనని శ్రీనివాసరావు తెలిపారు. ఈ మధ్య చంద్రబాబు, పవన్, మాధవ్, మంత్రులు కూర్చున్నారు.. వాళ్లలో తప్పుచేసిన భావన స్పష్టంగా కనిపించింది.. వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం మంచిది కాదు.. సీబీఐ సిట్ లో కూడా ఇద్దరు మీరు నియమించిన అధికారులే ఉన్నారు.. అయినా ఛార్జ్ షీట్ లో యానిమల్ ఫ్యాట్ లేదని క్లారిటీ ఇచ్చింది.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
ఇక, యానిమల్ ఫ్యాట్స్ అంటే భక్తులు నమ్మటం లేదని బాత్ రూంలు కలిసే యాసిడ్స్ కలిపారని కొత్త నాటకానికి తెరతీశారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అసలు తినే పదార్థాల్లో యాసిడ్స్ వేసుకుని తింటే ఎమవుతుందో మీరు కలుపుకుని చూస్తే అర్ధం అవుతుంది.. కొంత మంది జోకర్లు హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు.. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే లారీలు వచ్చాయి.. రిటర్న్ అయ్యాయి.. మల్లే అవే ట్యాంకర్లు లోపలికి వెళ్ళాయి.. దీనికి సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించాడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు అయినా వచ్చిందా.. మీ ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి.. అయోధ్యకు లక్ష లడ్లు పంపించి కల్తీ లడ్లూ తినిపించారని ఊగిపోతూ మాట్లాడిన పవన్.. అసలు ఆ లడ్డూలు ఎవరు తయారు చేయించారో అనే సమాచారం కూడా లేకుండా మాట్లాడి అపహాస్యం పాలయ్యారు.. రోజుకో రకంగా మాట్లాడే పవన్, నాగబాబును ఎవరు పట్టించుకోవటం లేదని శ్రీనివాసరావు వెల్లడించారు.
