Site icon NTV Telugu

Imran Khan Convoy: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

Imran Khan

Imran Khan

Imran Khan Convoy: తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ పాకిస్తాన్‌లోని లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయాణిస్తున్న కారు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.

ఇమ్రాన్ ఖాన్‌పై తోషాఖానా కేసులో విచారణ తిరిగి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఎంత ప్రయత్నించినా మాజీ ప్రధాని అరెస్టును తప్పించుకున్నారు. విచారణకు ముందు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, “నా అన్ని కేసులలో నాకు బెయిల్ వచ్చినప్పటికీ, పీడీఎం ప్రభుత్వం నన్ను అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది. వారి దుర్మార్గపు ఉద్దేశాలు తెలిసినప్పటికీ, నేను ఇస్లామాబాద్ కోర్టుకు వెళుతున్నాను, నేను చట్టబద్ధమైన పాలనను విశ్వసిస్తున్నాను. అయితే ఈ మోసగాళ్ల దుర్మార్గపు ఉద్దేశం అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.” అని అన్నారు.

Read Also: Fire Accident: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సజీవదహనం

ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని తన నివాసం నుంచి తన పార్టీ కార్యకర్తల కాన్వాయ్‌తో కలిసి బయలుదేరినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన హత్యాయత్నంలో ప్రాణాలతో బయటపడిన ఇమ్రాన్‌ఖాన్‌కు భద్రత కల్పించేందుకు కోర్టుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించారు. ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 విధించబడింది. గత విచారణలో ఇమ్రాన్ ఖాన్ తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేయాలని కోరాడు. దానిని కోర్టు తిరస్కరించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన బహుమతులను తోషాఖానా అనే స్టేట్ డిపాజిటరీ నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వాటిని లాభాల కోసం విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో విచారణకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

Exit mobile version