టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మక రోజు అన్నారు. ఈ గరుడా పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మొదటి సారి హైదరాబాద్ విజయవాడ మద్య లో ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని, ఈరోజు 10 బస్సులు లాంచ్ చేశామన్నారు. రానున్న రోజుల్లో మరో 40 బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇరవై నిమిషాలకూ ఒక బస్సు హైదరాబాద్ విజయవాడ మధ్య తిరుగుతాయన్నారు. ఈ సంవత్సరం 500 ఎలక్ట్రికల్ బస్సులు లాంచ్ చేస్తామని, ఈ బస్సు లో ఫ్రీ వైఫై సిస్టం, ట్రాకింగ్ సిస్టం, ప్యానిక్ బటన్ సిస్టం లు అందుబాటులో ఉన్నాయన్నారు.
Also Read : Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?
అనంతరం ఆర్టీసీ చైర్మన్‌బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తున్నాం.. చాలా సంతోషంగా ఉంది.. హైదరాబాద్ నుండి ఆంధ్రా కు ప్రతిరోజూ యాభై వేలమంది ప్రయాణిస్తున్నారు.. నష్టాలలో ఉన్న ఆర్టీసీ నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటున్నారు.. టీఎస్ఆర్టీసీ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు.. ప్రైవేటు కు దీటుగా ఆర్టీసీ నీ తయారు చేస్తున్నం.. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఆర్టీసీ నీ బతికించాలి, ఆర్టీసీ కార్మికులను బతికించాలని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ లో సంస్కరణలు తీసుకొచ్చారు.. టీఎస్ఆర్టీసీ నీ మెరుగైన రవాణా సంస్థగా తీర్చిదిద్దారని అన్నారు.
Also Read : Gautam Adani: 5,800 మీటర్ల నుంచి పడిపోయిన పర్వతారోహకుడికి గౌతమ్ అదానీ సహాయం
