Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో జరిగిన ఓ దారుణమైన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కేవలం పది రూపాయల చిల్లర విషయంలో జరిగిన గొడవ, ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలనే తీసేసింది. అసలు ఏం జరిగిందంటే.. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ముఖర్రం (42) అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఆటో ఛార్జీకి సంబంధించిన చిల్లర పది రూపాయల విషయంలో ఆయనకు, కొందరికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ మాట మాట పెరిగి కాస్తా గొడవగా మారింది. ఆవేశంతో రగిలిపోయిన సదరు వ్యక్తులు ముఖర్రంపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి కన్నుమూశారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అజీమ్ అనే ఒక యూట్యూబర్, మరో వ్యక్తి షోయబ్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయని, వారి పాత్రపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది? ఈ ఘటనలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అనే వివరాలు పోలీసులు అధికారికంగా తెలిజేయాల్సి ఉంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే బహదూర్ పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ అక్కడికి చేరుకుని, బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. “వట్టేపల్లి ప్రాంతంలో అజీమ్, షోయబ్ మరికొందరు అనుచరులు రౌడీషీటర్లుగా వ్యవహరిస్తూ గూండాగిరీ చేస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే ఇదే రోడ్డుపై జరిగిన రెండో హత్య ఇది. రాజేంద్రనగర్ డీసీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం,” అని ఎమ్మెల్యే ముబీన్ డిమాండ్ చేశారు.
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!