ఈరోజు, జనవరి 23న, దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున, జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. ఈ రోజు మారుతున్న ఋతువుల ప్రారంభం, వసంతకాలం ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని హృదయపూర్వకంగా పూజించడం వల్ల చదువుపై దృష్టి పెట్టడానికి, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు.
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల తో కిక్కిరిసిపోయింది బాసర పుణ్యక్షేత్రం. వసంత పంచమి సందర్భంగా అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు మొదలయ్యాయి. వేకువ జామునుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కిటకిట లాడుతున్న క్యూ లైన్లు.. అర్థరాత్రి నుంచి చదువుల తల్లి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. కొనసాగుతున్న చిన్నారుల అక్షర శ్రీకార పూజలు.. గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి.
Also Read:Mega 158 Update: బాస్‌తో జోడి కట్టబోతున్న ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీ!
వసంత పంచమిని పిల్లలకు పాఠశాల విద్య ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చిన్న పిల్లలకు మొదటిసారి రాయడం నేర్పించడం లేదా విద్యకు సంబంధించిన ఏదైనా కొత్త అడుగు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున పేద పిల్లలకు పుస్తకాలు, నోట్‌బుక్‌లు లేదా పెన్నులు దానం చేయడం కూడా పుణ్యప్రదంగా పరిగణిస్తారు.