సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం రెడీ అయింది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు తెలంగాణతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.