Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆర్చకులు వరుణ్ తేజ్‌కు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “కొండగట్టు అంజన్న మహిమగల దేవుడని, తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకుని స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని” పేర్కొన్నారు.
Duddilla Sridhar Babu : తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు.. 5 నిమిషాల్లో డ్రాయింగ్ స్క్రూట్నీ
ఇటీవల వరుణ్ తేజ్‌కి కాస్తంత అనుకూల పరిస్థితులు కలుగడం లేదు. తాజా సినిమాల షూటింగ్‌కు సమయం లేకపోయినా, హనుమాన్ దీక్ష తీసుకొని రాబోయే సినిమాలతో విజయాన్ని ఆశిస్తున్నట్లు చెప్పుకున్నారు. గతంలో “ఫిదా”, “తొలిప్రేమ”, “గద్దల కొండ గణేష్” వంటి సినిమాలు హిట్ కావడంతో, వరుణ్ తేజ్ కెరీర్ మంచి దిశలో సాగింది. కానీ “ఆపరేషన్ వాలంటైన్”, “గాండీవ ధారి అర్జున”, “గని” వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్‌లను అనుభవించారు. తాజాగా “మట్కా” సినిమా కూడా ఫ్లాప్ కావడంతో, ఆయన యాక్షన్ జానర్ నుంచి హార్రర్ కామెడీ జానర్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించారు.
వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా కోసం “వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”, “ఎక్స్‌ప్రెస్ రాజా” దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమా “యూవీ క్రియేషన్స్” , “ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్” బ్యానర్లతో సంయుక్తంగా నిర్మించబడనుంది. హార్రర్ కామెడీ నేపథ్యంతో రూపొందనున్న ఈ సినిమాను 2025 మార్చిలో ప్రారంభించడానికి ప్లాన్ చేశారు.
Urvil Patel: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ ఊచకోత..