Site icon NTV Telugu

Varun Chakravarthy: మ్యాచ్ ఓడినా.. రికార్డులు సృష్టించిన వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

Varun

Varun

Varun Chakravarthy: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి స్వదేశంలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌లలో వరుణ్ మొత్తం 10 వికెట్లు తీసాడు. గతంలో ఈ రికార్డును రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ 9 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉండేవారు.

Also Read: Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. ఊహించని రీతిలో పెరిగాయ్!

వరుణ్ చక్రవర్తి ఇంతకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా ఐదు వికెట్లు తీసిన ప్రదర్శన చేశాడు. దీంతో వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. టీ20 క్రికెట్‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఈ ఘనతను ఇదివరకు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు కూడా సాధించారు.

ఇక గత రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన వరుణ్ చక్రవర్తి, టీమిండియా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. మేము అనుకున్న విధంగా మ్యాచ్‌ను ముగించలేకపోయాం. ఆటలలో గెలుపోటములు సహజమే. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, తదుపరి మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతామని ఆయన పేర్కొన్నాడు. ఇక వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి 2023-24 సీజన్‌లో టీ20 క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత 10 మ్యాచ్‌లలో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి తన అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

Exit mobile version