Varun Chakravarthy: మ్యాచ్ ఓడినా.. రికార్డులు సృష్టించిన వరుణ్ చక్రవర్తి
- మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.
- మ్యాచ్ లో 5 వికెట్లతో మెరిసిన వరుణ్ చక్రవర్తి
- 5 వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డ్స్ బద్దలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Chakravarthy: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. దీనితో ప్రస్తుతం 2-1తో టీమిండియా ఆధిక్యంలో నిలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రికార్డ్స్ బద్దలు కొట్టాడు. గత రాత్రి జరిగిన మ్యాచులో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కోసం విలువైన వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. భారత స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి స్వదేశంలో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌లలో వరుణ్ మొత్తం 10 వికెట్లు తీసాడు. గతంలో ఈ రికార్డును రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ 9 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉండేవారు.
Also Read: Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. ఊహించని రీతిలో పెరిగాయ్!
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
వరుణ్ చక్రవర్తి ఇంతకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా ఐదు వికెట్లు తీసిన ప్రదర్శన చేశాడు. దీంతో వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. టీ20 క్రికెట్లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఈ ఘనతను ఇదివరకు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు కూడా సాధించారు.
ఇక గత రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన వరుణ్ చక్రవర్తి, టీమిండియా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని చెప్పాడు. మేము అనుకున్న విధంగా మ్యాచ్‌ను ముగించలేకపోయాం. ఆటలలో గెలుపోటములు సహజమే. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా, తదుపరి మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతామని ఆయన పేర్కొన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి 2023-24 సీజన్లో టీ20 క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత 10 మ్యాచ్‌లలో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి తన అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!