Site icon NTV Telugu

కుప్పం పోలీసులపై ఎన్‌ఈసీకి వర్లరామయ్య ఫిర్యాదు

చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్‌ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్‌ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు. 41 నోటీసు ఇవ్వకుండా టీడీపీ నేతలను ఎలా అరెస్టు చేస్తారు? రాత్రి అరెస్టు చేసి మధ్యాహ్నం వరకు ఎక్కడ తిప్పారు అంటూ ఆయన పోలీసుల తీరును ఎండగట్టారు. ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలకు కుప్పంలో ఏం పని అంటూ ఆయన వైసీపీ నేతలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటనపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Exit mobile version