Site icon NTV Telugu

Varanasi : ‘వారణాసి’లో మహేష్‌కి మించి షాక్ ఇవ్వబోతున్న మరో పాత్ర?

Varanasi, Mahesh Babu

Varanasi, Mahesh Babu

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (SSMB29) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు రూ.1300 కోట్ల భారీ వ్యయంతో, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు దీటుగా ఉండే మరో పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ ఉండబోతోందట. ఈ కీలక పాత్ర కోసం రాజమౌళి ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ పాత్రకు ఇచ్చే ఎలివేషన్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ విలన్ క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని, కథలో ఈ పాత్ర ఇచ్చే ‘షాక్’ సినిమాకే హైలైట్ అని ఫిలిం నగర్ టాక్.

Also Read : Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!

విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించగా, దేవా కట్టా ఈ చిత్రానికి పదునైన సంభాషణలు సమకూరుస్తున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో, రాజమౌళి తన మార్క్ మేకింగ్‌తో ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆ పవర్‌ఫుల్ విలన్ ఎవరో తెలిసే అవకాశం ఉంది.

Exit mobile version