Varanasi : జక్కన్నకు తలనొప్పిగా మారిన లీక్స్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వారణాసి వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి‘. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక రూపంలో లీకులు జక్కన్నకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
Also Read : Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?
Also Read
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
- Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
- CM Chandrababu: "తక్షణమే ఆదుకోండి".. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
గతంలోనే మహేష్ బాబు మరియు మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన క్లిప్ బయటకు వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఒక భారీ యాక్షన్ విజువల్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెట్స్‌లో ఎవరో ఒకరు సీక్రెట్‌గా తీస్తున్న ఈ వీడియోలు సినిమా హైప్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజమౌళికి ఈ లీకుల సమస్య కొత్తేమీ కాదు. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు మరియు యుద్ధానికి సంబంధించిన క్లిప్పింగ్స్ లీక్ అయ్యాయి. జక్కన్న తన సినిమాలను చాలా రహస్యంగా సర్ప్రైజ్లతో ప్లాన్ చేస్తారు. కానీ ఇలాంటి లీకులు జక్కన్న శ్రమను వృథా చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అవాంతరాలు ఎలా ఉన్నా సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజమౌళి రాజీ పడటం లేదు. గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్ ఖరారు చేశారు.
తాజావార్తలు
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!