సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ . పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆఫ్రికా, యూరప్ అడవుల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మూవీ గురించి ఏ చిన్న వార్త వచ్చిన సరే నిమిషాలో వౌనల్ అవుతుంది.. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రం బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో మంటలు రేపుతున్నాయి.
Also Read : Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్
ఇటీవల బాలీవుడ్ లో ఓ షోలో పాల్గొన్న ప్రియాంకను, హోస్ట్ కపిల్ శర్మ ఈ సినిమా బడ్జెట్ గురించి ప్రశ్నిస్తూ.. “ఈ సినిమాకు రూ.1300 కోట్ల బడ్జెట్ అంట కదా, నిజమేనా?” అని అడిగారు. దీనికి ప్రియాంక తనదైన శైలిలో స్పందిస్తూ.. “నిజంగానే 1300 కోట్లా? ఒకవేళ అదే నిజమైతే, అందులో సగం డబ్బు నా అకౌంట్‌లోకి వచ్చిందేమో నా మేనేజర్‌ని అడగాలి.. ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు, జక్కన్నను అడగాలి” అంటూ చమత్కారంగా కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో సినిమా బడ్జెట్ ఎంతనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Varanasi movie budget, Priyanka Chopra Varanasi comments, Mahesh Babu Rajamouli film, Varanasi movie updates, Rajamouli next movie budget
