సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే సూపర్ మ్యాన్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిపుణుడు హరికృష్ణన్ దగ్గర మహేష్ ఈ విద్యను నేర్చుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విలన్ ‘కుంభ’గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ఈ విద్యలో శిక్షణ తిసుకున్నరట.. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
Also Read : Shambhala OTT: శంబాల ఓటీటీ డీల్ డీటైల్స్ వైరల్..
దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలవనుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి, ఆ తర్వాత సుదీర్ఘంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్‌ను 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఒకపక్క హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, మరోపక్క పురాతన యుద్ధ కళల మేళవింపుతో రాబోతున్న ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
