Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండే వరూ.. కష్టపడి బరువుతగ్గి నాజూగ్గా మారింది. ఈ ఏడాది హిట్ సినిమాగా నిలిచిన హనుమాన్ లో హీరోకు అక్కగా నటించి మెప్పించి.. తన ఖాతాలో మరో హిట్ ను వేసుకుంది. ఇక ఈ మధ్యనే నికోలయ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో వరలక్ష్మీ నిశ్చితార్థం అత్యంత బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. అసలు ఈ చిన్నది ఎప్పుడో పెళ్లి చేసుకోవాలన్నది అంట. కానీ, ఆమె ప్లాన్స్ మొత్తం తారుమారు అయ్యాయని చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ వరూ.. తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనుకున్నది చెప్పుకొచ్చింది. ” నేను 22 ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను అనుకుకున్నది.. 28 ఏళ్లకు స్టార్ హీరోయిన్ అవ్వాలి.. ఆ తరువాత 32 ఏళ్లకు పెళ్లిచేసుకొని.. 34 ఏళ్లకు తల్లిని కావాలని అనుకున్నాను. కానీ, నేను వేసుకున్న ప్రెగ్నెన్సీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు నా వయస్సు 38. ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటున్నాను. ఇక ఎప్పటికి పిల్లలు పుడతారు అనేది నాకే తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.