NTV Telugu Site icon

Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!

9

9

ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్‌ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..

Also read: Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!

తను జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. పెళ్లి అనేది నా లైఫ్ లో సర్ప్రైజ్ అంటూ తెలిపింది. అసలు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. ఇప్పుడు నా జీవితంలో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలా నా జీవితంలో తెలియని సంఘటన సాగిపోతుందంటూ తెలిపింది. ఇంతకంటే నా లైఫ్ లో ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదని ఆవిడ తెలిపారు. ఇకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన కెరియర్ ను తాను ఖచ్చితంగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది.

Also read: AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు

సినీ పరిశ్రమంలో తాను దూరంగా ఉండనని.. తన ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే షూటింగ్ కు వచ్చానని నాకు సినిమా పట్ల నాకున్న కమిట్మెంట్ అదే అంటూ తెలిపింది. కాకపోతే ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి మాత్రం ఈ సంవత్సరం లోపలే జరుగుతుందంటూ ఆవిడ చెబుతూనే.. ఒకవేళ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా మీడియాకు అధికారికంగా తెలుపుతానని చెప్పుకొచ్చింది. అప్పటివరకు ఎలాంటి సమాచారం నా వద్ద దొరకదు అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. ఈ సంవత్సరం లోపే వివాహం జరిగేలా తన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆవిడ చెప్పింది. ఇక శబరి సినిమా గురించి చెబుతూ.. సినిమాలో ప్రేమను పంచే తల్లి కథ అని., ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందన్నది ఈ సినిమా కథ అని తెలిపింది.

Show comments