NTV Telugu Site icon

Vangaveeti Radha: నేడు అనుచరులతో వంగవీటి రాధా భేటీ.. దారెటు..?

Vangaveeti Radha

Vangaveeti Radha

ఏపీలో మరో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ క్రీయాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తింది. అందులోనూ వచ్చే సంవత్సరం కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. విజయవాడ గడ్డపై చెరగని ముద్రి వేసిన వంగవీటి ఫ్యామిలీ ఈసారి ఏ పార్టీ తరపున నిలబడుతుందోనన్న ఆసక్తి నెలకొంది. అయితే, నేడు వంగవీటి రాధా తన అనుచరులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ప్రస్తుత పాలిటిక్స్ పై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది.

Read Also: Lady Shaving: నిజమైన బ్రాహ్మంగారి కాలజ్ఞానం.. సెలూన్ లో అమ్మాయిలు షేవింగ్..!

ఈ సమావేశానికి రావాలని ముఖ్య నేతలకు వంగవీటి రాధా సమాచారం ఇచ్చాడు. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చంద్రబాబు సమక్షంలో సైకిల్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.. తాను కోరిన సీటును ఇవ్వకపోవడంతో వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు.

Read Also: AP BJP: పంచాయితీ నిధుల కోసం కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ పిలుపు

అయితే, వంగవీటి రాధా సోదరి ఆశా కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 28న వంగవీటి రాధా జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన అనుచరులు అనుకుంటున్నారు. వంగవీటి రంగా జయంతి కార్యక్రమాల మాదిరిగానే రాధా జయంతిని నిర్వహించేందుకు అనుచరులతో చర్చించేందుకు ఈ భేటీ అవుతున్నట్లు ఆయన అనుచరవర్గాలు చెబుతున్నాయి. ఇక, పార్టీ మార్పుపై ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చని రాధా అనుచనులు తెలిపారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం వంగవీటి రాధా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. రాధా జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీనిపై రాధా నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

Show comments