Pawan Kalyan vs Vanga Geetha: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి.. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి.. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తే.. మరికొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వడపోతల్లో నిమగ్నమయ్యాయి.. ఇక, టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల ప్రచారాన్ని ప్రారంభించారు.. పార్టీ కేడర్ గ్రామాలను చుట్టేస్తున్నారు.. అయితే, ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. దీనిక ప్రధాన కారణం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే ప్రధాన కారణం.
Read Also: The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?
పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది.. ఒకప్పుడు జమిందారులు పాలించిన పిఠాపురం సంస్థానం.. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతను పెంచిపోషించి ప్రత్యేకతను చాటుకుంది.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో పిఠాపురం పోరు ఉత్కంఠరేపుతోంది. 1955లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది. 1978 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు.. 1978లో కాంగ్రెస్ తరుపున కొప్పున మోహన్‌రావు గెలిస్తే.. 1983లో తెలుగుదేశం వేవ్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి నాగేశ్వరరావు, 1989లో కాంగ్రెస్ నుంచి కొప్పన మోహనరావు, 1994లో టీడీపీ తరపున నాగేశ్వరరావు, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు.. 2004లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు, 2009లో ప్రజారాజ్యం తరపున వంగా గీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండెం దొరబాబు విజయం సాధించారు. అయితే, నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు.. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలవడంతో ఈ సారి గెలుపు పవన్ కల్యాణ్‌దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతీ ఎన్నికల్లో విభిన్నతీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు.. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది..
Read Also: Andhra Pradesh: వరుడి బాగోతం బట్టబయలు.. పీటల మీద ఆగిన పెళ్లి..
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా? అసలు పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో.. తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌చేయండి..