NTV Telugu Site icon

Vande Bharat Train: త్వరలో 20 కోచ్‌లతో వందే భారత్‌ రైలు.. ఏ మార్గాల్లో నడువనుందంటే..?

Vande Bharat Train

Vande Bharat Train

భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్‌ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం. మరోవైపు ఈ రైలు స్పీడ్, సౌకర్యాల కారణంగా.. ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే.. ఈ రైలులో పెరుగుతున్న డిమాండ్ కారణంగా టిక్కెట్ల కొరత ఉంది. ప్రస్తుతం వందే భారత్ రైలు 8, 16 కోచ్‌లతో నడుస్తోంది. ఈ క్రమంలో జనాలు ఈ రైలు టిక్కెట్లు పొందడం కష్టంగా మారుతుంది.

Vinayaka Laddu Theft: ఓర్నీ నీ దుంపతెగ.. వినాయకుడిని కూడా వదలని దొంగ!

ఉత్తర రైల్వే రూట్లలో 20 కోచ్‌లతో వందేభారత్ రైలు నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. న్యూఢిల్లీ-వారణాసి (రెండు రైళ్లు), న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (రెండు రైళ్లు), న్యూఢిల్లీ-అంబ్ అండురా (హిమాచల్ ప్రదేశ్), హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలపతి, న్యూఢిల్లీ మార్గాల్లో ఈ రైలు నడిచే అవకాశం ఉంది. ఈ రైలు వేగం గంటకు 130 కి.మీ. 20 కోచ్‌లతో కూడిన వందేభారత్ రైలును ఆగస్టులో విజయవంతంగా ట్రయల్ చేశారు.

Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు

ప్రస్తుతం.. 16 కోచ్‌ల వందే భారత్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ AC చైర్ కార్ కోచ్‌లు, 16 AC చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 1204 సీట్లు ఉన్నాయి. 20 కోచ్‌లతో కూడిన వందే భారత్‌లో ప్రయాణికులకు ఎక్కువ స్థలం ఉంటుంది. సీటింగ్ కెపాసిటీని 25 శాతం పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వివిధ మార్గాల్లో 11 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.

Show comments