Site icon NTV Telugu

Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

Vandhe Barath

Vandhe Barath

Vande Bharat Express: వందే భారత్‌ రైలు భారతదేశంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ప్రీమియం రైలు. ఇది వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించడంలో నూతన ప్రమాణాలను సృష్టించింది. ఇటీవల సెప్టెంబర్ 16, 2024 న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మహారాష్ట్రలో కొత్త మార్గాల్లో ప్రారంభించబడింది. అయితే ఈ రైళ్లు మొదలైనప్పటి నుండి అప్పుడప్పుడు వీటిపై రాళ్లు విసిరిన అనేక ఘటనలను చూసాము. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి ఘటన వెలుగు చూసింది. ముంబయి నుండి షోలాపూర్ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సి-11 కోచ్‌ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు రువ్వాడు. ఈ ఘటన జ్యూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాళ్ల దాడి కారణంగా కోచ్‌ కిటికీ అద్దాలు పగిలిపోయాయి.

Also Read: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా

అయితే, అదృష్టవశాత్తు ఈ దాడి ఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. కానీ, రైలు భద్రతపై ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. రైల్వే అధికారులు ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టారు. అయితే, రాళ్ల దాడి చేసిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది. వందే భారత్‌ రైలుపై రాళ్లు రువ్వడం కొత్త విషయం కాదు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఢిల్లీ-ఉనా వందే భారత్‌ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. అప్పుడు భద్రతా దళాలను రైలు ప్రయాణానికి మోహరించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ముంబయి-సోలాపూర్ వందే భారత్‌ రైలు పై జరిగిన ఈ దాడి భద్రతా వ్యవస్థపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఇటువంటి రైలు పై రాళ్ల దాడి ఘటనలు రైల్వే భద్రతా వ్యవస్థపై తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భద్రతను పటిష్టం చేయడం ద్వారా ఇలాంటి ఘటనలపై నిలిచిపోయే చర్యలు తీసుకోవడం అవసరం.

Exit mobile version