భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనమా వెంకటేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సహకరిస్తే కొత్తగూడెం నియోజకవర్గన్ని అభివృద్ధి లో నెంబర్ వన్ చేస్తానన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని కోట్లయిన సరే సీఎం కేసీఆర్ నాకు స్వయంగా చెప్పి కార్యచరణ ప్రారంభించమని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ ని తీసుకువచ్చి వంద పడకల హాస్పిటల్ కు శ్రీకారం చుడతామని ఆయన వెల్లడించారు.
Also Read : Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో దారుణం.. లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి
నా జన్మ ధన్యం అయ్యే విధంగా రోజుకు 18 గంటలు అభివృద్ధికి పని చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు జరుగుతున్నాయని, నాకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల నుంచి దూరం కాను అని ఆయన అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని, పాల్వంచలో ఇప్పుడు 50 పడకలకు అదనంగా, వంద పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. కొత్తగూడెం మొర్రేడు వాగుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్, నిర్మాణానికి 33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
Also Read : Taneti Vanitha: పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు