Site icon NTV Telugu

Vamika Birthday: వామికా పుట్టిన రోజు.. వైరల్‌గా మారిన కోహ్లీ, అనుష్క వీడియో!

Vamika Birthday

Vamika Birthday

Anushka Sharma and Virat Kohli’s daughter Vamika turns 3: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల తనయ ‘వామికా’ పుట్టిన రోజు నేడు. 2021 జనవరి 11న వామికా జన్మించిన విషయం తెలిసిందే. నేటితో వామికా మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వామికాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, టీమిండియా క్రికెటర్స్ చిన్నారికి బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ, అనుష్క, వామికాలకు సంభదించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read: Manipur Fuel Leak: మణిపుర్‌లో భారీగా ఇంధనం లీక్.. భయభ్రాంతులకు గురైన ప్రజలు!

అఫ్గాన్‌తో ఈరోజు రాత్రి జరిగే తొలి టీ20కి వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరమయిన విషయం తెలిసిందే. కూతురి బర్త్ డే కోసం విరాట్ తొలి టీ20కి దూరంగా ఉన్నాడని అర్ధమవుతోంది. వామికా పుట్టిన రోజు వేడుకలను అనుష్క శర్మ ఘనంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క గర్భవతి అన్న విషయం తెలిసిందే. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరిగే రెండో టీ20కి ముందు భారత జట్టుతో కోహ్లీ కలుస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుంది.

Exit mobile version