Vallabhaneni Vamsi Mohan: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక 150 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్ పైన ఉందో చెప్పాలి..? అంటూ డిమాండ్ చేశారు.. పోయే కాలం వచ్చిన వాళ్లు… వాళ్లు పోయారు, వీళ్లు పోయారు అంటూ అరుస్తుంటారు అని సెటైర్లు వేశారు.
Read Also: Air India: ఎయిర్ ఇండియాలో మరో ఘటన.. కాక్‌పిట్ లోకి మహిళను తీసుకువచ్చిన పైలెట్..
74 ఏళ్లు వచ్చిన చంద్రబాబుకు పరిణితి రాలేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వల్లభనేని వంశీ.. వాళ్లను చూసి ఆ పార్టీ నాయకులంతా మాట్లాడతారన్న ఆయన.. గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చు అన్నారు.. అంతెందుకు చంద్రబాబు గానీ, లోకేష్ గానీ పోటీ చేయమని నేను చాలా సార్లు డైరక్ట్ గా చెప్పానంటూ తన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.. కాగా, కృష్ణ జిల్లా గన్నవరంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా సమర్థులైన వారిని చంద్రబాబు నియమిస్తారన్న ఆయన.. ఎవరు ఆందోళన చెందనవసరం లేదు.. ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ నా దగ్గరకు ఒక్కరు వచ్చారని చెప్పుకొచ్చారు.. పార్టీలో ఉన్నవారు వెళ్తుంటారు.. కొత్తవారు వస్తుంటారు.. సరైన, ధీటైనా వారిని మీరు మీసం మేలేసే వారిని.. ఈసారి తీసుకువస్తాం అంటూ చింతమనేని కామెంట్‌చేసిన విషయం విదితమే.