NTV Telugu Site icon

Janasena Party: ఉత్కంఠకు తెర.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఆ మూడు పెండింగ్‌

Vallabhaneni Balashowry

Vallabhaneni Balashowry

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుల్లో భాగంగా.. 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ.. అయితే, జనసేన ఇప్పటికే ప్రకటించిన లిస్ట్‌లో మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.. ఎన్నికల తరుణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. జనసేనలో చేరారు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. కానీ, ఇప్పటి వరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేయకపోవడంతో.. బాలశౌరి పొలిటికల్‌ ప్యూచర్‌ ఏంటి? అనే చర్చ సాగింది.. ఇదే సమయంలో.. మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. మొత్తంగా.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థినిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..

Read Also: Bharat Ratna : భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు

మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ తరుపున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేసినట్టు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసన సభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని.. కానీ, అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని.. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. సర్వేకు సంబంధించిన ఫలితాలు వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది జనసేన. అయితే, మొత్తంగా చూస్తే ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలను పెండింగులో పెట్టింగ్‌లో పెట్టింది జనసే.. అందులో ఒకటి విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. కానీ, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో కసరత్తు కొనసాగుతోంది.. త్వరలోనే ఆ మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్‌ కల్యాణ్.