Vaibhav Suryavanshi: బ్యాటింగ్‌తోనే కాదు.. సంస్కారంతోనూ ఆకట్టుకున్న బుడ్డోడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్.. మరోసారి పెద్దలపట్ల ఉన్న వినయంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ భారత మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్ కాళ్లు మొక్కుతూ ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పెద్దల పట్ల అతడు చూపిస్తున్న గౌరవానికి నెటిజన్లు ‘వండర్ కిడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ముల్లాన్‌పూర్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో రాజస్థాన్ జట్టు ప్రాక్టీస్ సందర్భంగా వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. అదే సమయంలో గ్రౌండ్లో ప్రీ-మ్యాచ్ షో కోసం సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్, స్పోర్ట్స్ కామెంటేటర్ జతిన్ సప్రూ కూడా అక్కడే సమాలోచనలు చేస్తున్నారు.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
వారిని గమనించిన వెంటనే వైభవ్ పరుగెత్తుకుంటూ వెళ్లి ముందుగా గవాస్కర్, ఆ తర్వాత సంజయ్ బంగర్ కాళ్లు మొక్కాడు. అలాగే పక్కనే ఉన్న జతిన్ సప్రూ కాళ్లు కూడా ముక్కబోగా ఆయన కొద్దిగా వెనక్కి వెళ్లడం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత వైభవ్ తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే అంతటి వినయం, పెద్దల పట్ల గౌరవం చూపిస్తున్న వైభవ్‌ను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. “టాలెంట్‌తో పాటు సంస్కారం కూడా”, “ఇలాంటి ఆటగాళ్లే భారత క్రికెట్ భవిష్యత్” అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కేవలం 3 పరుగుల తేడాతో టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును చేజార్చుకున్నాడు.
Vaibhav Sooryavanshi rushed to touch the feet of Sunil Gavaskar and Sanjay Bangar, who were doing the pre-match show 😂 Dhoni ,Live TV#SRHvsRR #JioOTTPass pic.twitter.com/a9wNes4AZ9
— Rolex x👑 (@Tfg85743663) May 27, 2026
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!