Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి శుభవార్త.. రెండో టీ20లో బరిలోకి వైభవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, వైభవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది. తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ తీవ్రమైన కండరాల నొప్పుల బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గాయం తీవ్రత కారణంగానే తొలి మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సి వచ్చిందని, శనివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోచ్ స్పష్టం చేశారు.
ఇషాన్ కిషన్ గైర్హాజరీ ఇప్పుడు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ఎంతో కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న వైభవ్, భారత సీనియర్ టీ20 జట్టు తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ రూపంలో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉండటంతో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు ఇషాన్ రూపంలో వచ్చిన ఈ ఊహించని మార్పు వైభవ్‌కు ఒక వరంలా మారింది. కోచ్ సీతాంశు కోటక్ కూడా ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే బలమైన అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు.
Also Read
వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనింగ్ కాంబినేషన్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. తొలి మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధశతకంతో (67 పరుగులు) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న సంజు, ఇకపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు మొదట్నుంచే వణుకు పుట్టడం ఖాయం. ఈ ఇద్దరు హిట్టర్లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే టీమిండియా పవర్‌ప్లేలో భారీ స్కోరు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. మొత్తానికి, ఇషాన్ గాయం రూపంలో వచ్చిన అవకాశాన్ని వైభవ్ సూర్యవంశీ ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి శుభవార్త.. రెండో టీ20లో బరిలోకి వైభవ్..
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
-
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య