Site icon NTV Telugu

Vaibhav Sooryavanshi: ‘ సూర్యవంశీ వైభవ్‌ను అరెస్ట్ చేయాలి’.. ఐస్లాండ్ క్రికెటర్స్ షాకింగ్ డిమాండ్!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోంది. దానికి ఏకైక కారణం 14 ఏళ్ల కుర్రాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసింది. హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఇది పిల్లల ఆట కాదని అందరికీ అర్థమైంది. ఇంగ్లండ్ బౌలర్లపై అతడు చూపిన దూకుడు చూసి క్రికెట్ ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లోనూ వైభవ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్ పట్టాడు. మొదటి బంతి నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై దాడి మొదలుపెట్టాడు. బౌండరీలు, సిక్సర్లు వరుసగా వస్తుండటంతో స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. టీవీల ముందు కూర్చున్న అభిమానులు కూడా కళ్లార్పకుండా చూశారు. ఈ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

READ MORE: Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..

ఒక ప్రత్యేక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది ఐస్లాండ్ క్రికెట్ చేసిన సరదా ట్వీట్. వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లను ఇలా చితక్కొట్టడంతో “వెంటనే వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి” అంటూ సరదాగా ట్వీట్ చేశారు. “ఇంగ్లండ్ బౌలర్లపై మైదానంలో జరుగుతున్న ఈ హింస X-రేటెడ్” పేర్కొన్నారు. వాళ్ల రాతలు సోషల్ మీడియాలో నవ్వులు పూయించాయి. ఇది విమర్శ కాదు, వైభవ్ ఆటను పొగడ్తలతో చెప్పిన హాస్యమే. ఇప్పటికే తన ఫన్నీ పోస్టులతో ఫేమస్ అయిన ఐస్లాండ్ క్రికెట్, ఈసారి అభిమానులను ఆకట్టుకుంది. ఆ ట్వీట్‌ను వేల మంది షేర్ చేశారు.

READ MORE: D55 :ధనుష్-రాజ్‌కుమార్ పెరియసామి మూవీ షురూ.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి, శ్రీలీల.. క్రేజీ మల్టీస్టారర్!

నిజం చెప్పాలంటే వైభవ్ నిన్న ఆడిన మ్యాచ్ సాధారణ ఇన్నింగ్స్ కాదు. టోర్నీ ఫైనల్లో 175 పరుగులు చేయడం అంటే చిన్న విషయం కాదు. అతడు కొట్టిన షాట్లు చూస్తే, బంతి ఎక్కడ పడుతుందో బౌలర్లకే అర్థం కాలేదు. 15 ఫోర్లు, 15 సిక్సర్లు చాలా సులువుగా బాదాడు. పేస్ బౌలింగ్, స్పిన్, షార్ట్ బాల్స్, స్లో బాల్స్ ఏదీ అతడిని ఆపలేకపోయింది. రన్ రేట్ ఎప్పుడూ తగ్గలేదు. కెప్టెన్ ఆయుష్ మాథ్రేతో కలిసి వైభవ్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లండ్‌ను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేశారు. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో వైభవ్ అవుట్ అయ్యాడు. ఒకవేళ ఆ 200 వచ్చి ఉంటే అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అతడు మరింత ప్రత్యేకంగా నిలిచేవాడు. అయినా సరే, ఫైనల్లో చేసిన 175 పరుగులే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచాయి.

Exit mobile version