Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న ట్రై-నేషన్ ‘A’ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 15) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రారంభంలో తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నప్పటికీ.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.
ఈ సిరీస్‌లో వైభవ్ ప్రదర్శనను పరిశీలిస్తే.. అతడు నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 12 బంతుల్లో 14 పరుగులు చేసిన అతడు, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌పై 22 బంతుల్లో 44 పరుగులతో మెరిశాడు. అయితే మరోసారి శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 21 పరుగులకే పరిమితమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 79 పరుగులు చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
వైభవ్ బ్యాటింగ్‌లో దూకుడు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. మరోవైపు అతడి వికెట్ల పతనానికి కూడా కారణమవుతోంది. ముఖ్యంగా గాల్లోకి షాట్లు ఆడే ప్రయత్నంలో అతడు తరచూ వికెట్ కోల్పోతున్నాడు. తన అటాకింగ్ స్టైల్ ను కొనసాగిస్తూనే, పరిస్థితులకు అనుగుణంగా ఓర్పుతో బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం మరింత ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కాకుండా.. సుదీర్ఘ ఫార్మాట్లలోనూ విజయవంతం కావాలంటే వైభవ్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వన్డే జట్టులో తన స్థానంపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ ఆటగాడిగా వైభవ్‌కు ఇంకా ఎంతో సమయం ఉన్నప్పటికీ.. తన ఆటలో కొంత సంయమనం, మరింత బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ను జోడించగలిగితే అతడు భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
Into the slot. Vaibhav Sooryavanshi sends it Into the stands. 😮💨💥
Watch #TalentTVCup LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 pic.twitter.com/5gCjn5rgyq
— Sony LIV (@SonyLIV) June 15, 2026
VAIBHAV SOORYAVANSHI GONE FOR 21 OFF 14 BALLS.
– 14 (12) vs Sri Lanka A in 1st match.
– 44 (22) vs Afghanistan A in 2nd match.
– 21 (14) vs Sri Lanka A in 3rd match. [Today] pic.twitter.com/GLfDvEhmYW— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!