Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ధనాధన్ బ్యాటింగ్ విన్యాసంతో వార్తల్లో నిలిచాడు. దంబుల్లాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక A పై కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ A విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ A 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. శ్రీలంక A లక్ష్యానికి 66 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.
ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే అవార్డు తర్వాత జరిగిన ఇంటర్వ్యూ సంభాషణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీ20 క్రికెట్లో నీవు అద్భుతంగా ఆడుతున్నావు.. కానీ, వన్డేలు ఎక్కువగా ఆడలేదు. ఈ టోర్నమెంట్ నుంచి ఏమి నేర్చుకున్నావు? అని ప్రెజెంటర్ ప్రశ్నించగా.. వైభవ్ ఆ వ్యాఖ్యను పూర్తిగా ఖండించాడు.
Also Read
ప్రెజెంటర్ అడిగిన ప్రశాంకు వైభవ్ సమాధానమిస్తూ.. నేను వన్డే ఫార్మాట్లో కూడా చాలానే మ్యాచ్‌లు ఆడాను. అది చాలామందికి తెలియకపోవచ్చు. వన్డేలు ఆడలేదనేది కేవలం ఒక పుకారు మాత్రమే అంటూ కొట్టి పడేశాడు. ఇంకా దంబుల్లా పిచ్, అక్కడి పరిస్థితులు తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చాయని.. ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు.
ట్రై సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వైభవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 4 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు. అంతేకాదు కేవలం 3 సిక్సర్లు మాత్రమే బాదాడు. కానీ ఫైనల్ లో మాత్రం తన ఆట తీరు పూర్తిగా మార్చుకుని ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రీలంక Aపై 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-A క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ ఫైనల్ ఇన్నింగ్స్‌తో ట్రై సిరీస్‌ను వైభవ్ మొత్తం 211 పరుగులతో ముగించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేయడంతో పాటు మొత్తం 11 సిక్సర్లు బాదాడు.
The SMILE in the end 😅
Playing with freedom. Speaking with confidence. Smiling through it all. 😊
Vaibhav Sooryavanshi, your 𝘗𝘓𝘈𝘠𝘌𝘙 𝘖𝘍 𝘛𝘏𝘌 𝘔𝘈𝘛𝘊𝘏!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/Cg8BZzVQ9Q
— Sony Sports Network (@SonySportsNetwk) June 21, 2026
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!