Riyan Parag: నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై రాజస్థాన్ రాయల్స్ (RR) ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ గెలవడంలో వైభవ్ సూర్య వంశీ కీలక పాత్రం పోషించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ 26 బంతుల్లో మెరుపు వేగంతో 78 పరుగులు చేశాడు. ముఖ్యంగా, సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే 200 పరుగులు సాధించి, సూర్యవంశీ ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) హోల్డర్‌గా సైతం నిలిచాడు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ అని.. జట్టులోని అందరూ ఈ కుర్రాడిని ఇష్టపడతారని వెల్లడించాడు.
READ MORE: Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!
మ్యాచ్ అనంతరం జరిగిన సమావేశంలో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. “చాలా వైభవ్ సూర్యవంశీ సరదాగా ఉంటాడు. జట్టులో ఈ కుర్రాడిని అందరూ ఇష్టపడతారు. సూర్యవంశీకి తినడం, బయటకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. అందుకే మేము ముందుగా ఈ ఏర్పాట్లు చేస్తాం. అతను ఇలాగే బ్యాటింగ్ చేస్తూ ఉంటే, అతనికి కావాల్సిన ఫుడ్, బయట తిరగడానికి అవసరమైనవన్నీ జట్టు తరపున మేమే ఏర్పాటు చేస్తాం. అతను హ్యాపీగా ఉంటే చాలు.. అతనికి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే మేము ఆ అవకాశాన్ని కల్పించేలా చూసుకుంటాం. ఇక గత సీజన్‌లో మేము బాగా రాణించలేకపోయాం. కానీ ఈరోజు చాలా పకడ్బందీగా ఆడాము. మేము బౌలింగ్ చేసిన తీరు, ప్రారంభించిన విధానం చూస్తే, 200 పరుగులు చేసినా, అది మా లక్ష్యం కంటే 20 పరుగులు ఎక్కువ అనిపించింది. వారిని సుమారు 170 పరుగులకే కట్టడి చేసి ఉండాల్సింది.” అని రియాన్ పరాగ్ వెల్లడించాడు.
