Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అభిమానుల ఆశలను ఆవిరి కానివ్వకుండా RCB రెండో టైటిల్ ను ముద్దాడింది. అయితే ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో క్రికెట్ అభిమానుల మనసుల్లో మాత్రం చెరిగిపోని ముద్ర వేసుకున్నది మాత్రం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించినప్పటికీ, వ్యక్తిగత ప్రదర్శనల పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మాత్రం వైభవ్ సూర్యవంశీయే.

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ మొత్తం ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ స్థాయి స్టార్ బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో అలరించాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. వైభవ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనల కారణంగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో క్వాలిఫయర్-2 వరకు చేరుకుంది. చివరకు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిపాలై ఫైనల్‌కు చేరలేకపోయినప్పటికీ, జట్టు విజయయాత్రలో వైభవ్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. గత సీజన్‌లో పాయింట్ల పట్టిక చివరి స్థానాల్లో నిలిచిన రాజస్థాన్, ఈసారి బలమైన పోటీదారుగా మారడానికి అతని బ్యాటింగ్ ప్రధాన కారణమైంది.

×
×
Ad

ఈ సీజన్‌లో వైభవ్ అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ రికార్డుకు అత్యంత చేరువగా వెళ్లిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన శతకం రికార్డును బద్దలు కొట్టే దశ వరకు వెళ్లినా, చివరికి స్వల్ప తేడాతో ఆ ఘనతను అందుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డులు ఇవే..

* ఆరెంజ్ క్యాప్ – రూ.10 లక్షలు
* మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) – రూ.15 లక్షలు
* సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్
* సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ – రూ.10 లక్షలు
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – రూ.10 లక్షలు
ఒక్క సీజన్‌లోనే ఇన్ని వ్యక్తిగత అవార్డులు అందుకోవడం ద్వారా వైభవ్ తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకంగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు జైషా పక్కన కూర్చుని మ్యాచ్ ను తిలకించారు. సీజన్ మొత్తంలో గెలుచుకున్న అవార్డులను అందుకోవడానికి అతడు ఫైనల్ వేడుకల్లో పాల్గొన్నాడు.