Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఓ 15 ఏళ్ల కుర్రాడు. స్టార్ బౌలర్లను సైతం వణించాడు. సోమవారం గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువకుడు కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యంత వేగవంతమైన అర్ధశతకం కాగా, రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాట్స్‌మెన్‌లలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. 2023లో కేకేఆర్‌పై 13 బంతుల్లో అర్ధశతకం సాధించిన యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో ఉండగా.. వైభవ్ రెండో ప్లేస్‌కి చేరుకున్నాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తన 15 బంతుల ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 305.88గా ఉంది. ఇక మొత్తం మ్యాచ్‌లో 17 ఆడి 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే, ఈ సీజన్ ఐపీఎల్‌లో తన మొట్టమొదటి మ్యాచ్‌లోనే వైభవ్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. సురేష్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ (16 బంతులు) పేరిట ఉన్న రికార్డులను వైభవ్ అధిగమించాడు.
READ MORE: Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
- Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
రాజస్థాన్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితా:
1. యశస్వి జైస్వాల్ – 13 బంతులు vs KKR, 2023
2. వైభవ్ సూర్యవంశీ – 15 బంతులు vs CSK, 2026
3. వైభవ్ సూర్యవంశీ – 17 బంతులు vs గుజరాత్ టైటాన్స్, 2025
4. జోస్ బట్లర్ – 18 బంతులు vs 1 ఢిల్లీ, 18 బంతులు
CSKపై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీల జాబితా:
1. ర్యాన్ రికెల్టన్ – 14 బంతులు, 2025
2. వైభవ్ సూర్యవంశీ – 15 బంతులు, 2026
3. కీరన్ పొలార్డ్ – 17 బంతులు, 2021
గత ఏడాదిగా వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆసక్తికరంగా, ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే ఔట్ కావాల్సింది. కానీ.. ఈ క్యాచ్‌ను కార్తిక్ శర్మ జారవిడిచాడు. తనకు లైఫ్ దొరకడంతో వైభవ్ చెలరేగాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే సీఎస్‌కే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశస్వి 36 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రియాన్ పరాగ్ 11 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తాజావార్తలు
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?