Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి బారి అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం రెండు వారాలకే తన రన్‌ను ముగించే స్థితికి చేరుకుంది.
Also Read : Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే
Also Read
- Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 92 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినాతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. గత ఆదివారం ఈ చిత్రం కేవలం రూ. 1.03 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగా సోమవారం నాటికి ఆ వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. దీంతో పవర్ స్టార్ కెరీర్లో ఇది మరొక భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయేలా కనిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండటం ‘ఉస్తాద్’కు శాపంగా మారింది. మరోవైపు ఉస్తాద్‌లో పాత కాలపు మాస్ ఫార్ములా సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ మరియు అర్బన్ సెంటర్లలో ఈ సినిమా ప్రభావం చాలా తక్కువగా ఉంది. హరీష్ శంకర్ గత సినిమాల్లోని సీన్లను గుర్తు చేసే విధంగా ఉండటం, స్క్రీన్ ప్లేలో వేగం తగ్గడం వంటి కారణాల వల్ల సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యారు. ఫలితంగా భారీ నష్టాలతో ఉస్తాద్ భగత్ సింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..