Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) బాదుడుతో బౌలింగ్ అటాక్, బౌండరీ లైన్, రికార్డలన్నీ తేలిపోయాయి. దోహా (Doha)లో యూఏఈ (UAE) తో జరిగిన మ్యాచ్‌లో ఈ టీనేజర్ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు బాదేసి అందరినీ నివ్వరపోయేలా చేశాడు. అందులో ఏకంగా 28 సిక్సర్లు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూఏఈ జట్టు 50 ఓవర్లు ఆడి 249 పరుగులు చేస్తే, ఇండియా ఎ (India A) జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే టార్గెట్ ఊదేసింది. పాపం స్కోర్‌కార్డ్ చూస్తే ఎవరో హ్యాక్ (hack) చేసినట్టు అనిపించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. కానీ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే వైభవ్‌కు ఇండియా వన్డే (ODI) టీమ్ తలుపులు తెరుచుకుంటాయా అంటే, ప్రస్తుతానికి ఆ ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే మన వన్డే జట్టులో బ్యాటర్ల కొరత ఏమీ లేదని నిపుణులు అంటున్నారు.
అయితే.. వైభవ్ రికార్డు ఇన్నింగ్స్‌లు టీవీ చానెల్స్‌కి మంచి మసాలా అవుతాయి కానీ, సెలెక్టర్ల పనిని మాత్రం తలనొప్పిగా మారుస్తాయి. వన్డే జట్టు టాప్ ఆర్డర్లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill), రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లాంటి దిగ్గజాలు ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్లే కాకుండా బెంచ్ స్ట్రెంగ్త్ కూడా గట్టిగానే ఉంది. లిస్ట్ ఎ (List A) క్రికెట్లో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) కి 82.23 యావరేజ్ ఉంది. సాయి సుదర్శన్ (Sai Sudharsan) కూడా 59.80 యావరేజ్‌తో దుమ్మురేపుతున్నాడు. వీళ్లంతా దేశవాళీ క్రికెట్లో ఎన్నో సీజన్లుగా ఆడి, వన్డే ఇన్నింగ్స్‌లో సత్తా చాటాలని ఎదురు చూస్తున్నారు. సూర్యవంశీ ఆట చూసి సెలెక్టర్లు ఆశ్చర్యపోవచ్చు కానీ, కేవలం సిక్సర్లు కొట్టే ఆటగాడి కంటే, జట్టులో ఒక నిర్దిష్టమైన పాత్ర పోషించగలిగే ఆటగాడు ఇండియాకి కావాలి. బంతి సరిగ్గా బ్యాట్ మీదకు రానప్పుడు, ఫీల్డింగ్ విస్తరించినప్పుడు ఎలా ఆడతాడనేది ముఖ్యం. యూఏఈ బౌలింగ్ మీద సూర్యవంశీ విరుచుకుపడిన మాట నిజమే కానీ, ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ బంతి స్వింగ్ అవుతుంది, మంచి రిస్ట్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, బౌండరీలు ఆపడానికి పక్కా ఫీల్డింగ్ ఉంటుంది. సుమారు 385 స్ట్రైక్ రేట్‌తో ఆడే సూర్యవంశీ, 100 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన పరిస్థితి వస్తే గేర్లు మార్చగలడా అనేదే అసలు ప్రశ్న. అనవసరమైన షాట్స్ ఆడకుండా, సింగిల్స్ తీస్తూ స్కోర్‌బోర్డ్‌ని ఎలా కదిలిస్తాడు అనేది అనుభవంతోనే తెలుస్తుంది. వేగంగా ఆడటం తనకు వచ్చు అని నిరూపించాడు, ఇక ఆ వేగాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- 9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
- Warangal: బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు.. అదృశ్యమైందంటూ డ్రామా.. కట్‌చేస్తే..
- Kavya Maran - Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
- Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
సహజంగానే ఈ ఇన్నింగ్స్‌ని 1998 షార్జా (Sharjah) లో సచిన్ టెండూల్కర్ ఆడిన డెజర్ట్ స్టార్మ్ ఇన్నింగ్స్‌తో పోలుస్తారు. ఇద్దరూ యువకులే, ప్రత్యర్థి బౌలింగ్‌ని చితక్కొట్టినవాళ్లే. కానీ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై, ఫైనల్ (final) చేరాలనే ఒత్తిడిలో, వాతావరణం కూడా సహకరించని పరిస్థితుల్లో సచిన్ 143 పరుగులు చేశాడు. సూర్యవంశీ 204 లిస్ట్ ఎ రికార్డు అయినా, అది ఇండియా ఎ తరఫున యూఏఈపై చేసిన పరుగులు. 250 టార్గెట్‌ని 14.2 ఓవర్లలోనే చాలా ఈజీగా చేజ్ చేశారు. దీంతో సూర్యవంశీ సాధించిన రికార్డు తక్కువేమీ కాదు కానీ, డెజర్ట్ స్టార్మ్ స్థాయికి అప్పటి పరిస్థితులు, ప్రత్యర్థి, టోర్నమెంట్ ప్రాధాన్యత వేరుగా ఉన్నాయి.
క్రికెట్ నిపుణులు, పలువురు మాజీ స్టార్ ప్లేయర్ల వివరణల ప్రకారం.. సూర్యవంశీ విషయంలో ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి ఇంకా 15 ఏళ్లే. టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు, తను నెలకొల్పిన రికార్డులు కొన్ని నిదానమైన ఇన్నింగ్స్‌లతో చెరిగిపోవు. అతనికి సరైన రన్‌వే ఇచ్చి, సీనియర్ క్రికెట్లో ఆడిస్తూ, వన్డే ఆటలోని లయని అలవాటు చేయాలి. ఓపికగా ఆడుతూ, జట్టుకు నిలకడైన ఆటగాడిగా ఎదగడానికి కాస్త సమయం ఇవ్వాలి. త్వరలోనే అతను వన్డే జట్టు చర్చల్లోకి రావచ్చు కానీ, ప్రతి అద్భుతమైన ఇన్నింగ్స్‌కి వెంటనే ఇండియా క్యాప్ డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అభిమానులు, పెద్దలు అతన్ని ఎదగనివ్వాలి. ఈ 204 పరుగుల ఇన్నింగ్స్‌లో అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే, అతని ఆలోచనలో ఉన్న స్పష్టత. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) లాంటి దిగ్గజాల సలహాలు తీసుకుని వాటిని మైదానంలో అమలు చేస్తున్న తీరు చూస్తుంటే, ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్‌కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
-
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
-
Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్‌కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
ట్రెండింగ్
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!