NTV Telugu Site icon

V.Hanumantha Rao : బీసీని పీసీసీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడు..

Vh

Vh

హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని, జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు వారికే దక్కాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కులగణన చేయాలని.. సపరేట్ మినిస్ట్రీని ఇవ్వాలని బీజేపీని కోరాం పట్టించుకోలేదని, తెలంగాణలోని ఆరు డిక్లరేషన్లతో పాటు బీసీ కులగణన చేపడతామని పార్టీ చెప్పిందన్నారు వి. హనుమంతరావు. మొన్నటి ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అనగానే బీసీనా రెడ్డినా అనేది చూడకుండా ఓట్లు వేశారని, బీసీ ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావు అని ఉత్తమ్ కు చెప్పాను.. ఉత్తమ్ కూడా ఒప్పుకున్నాడన్నారన్నారు. నేను రాజకీయాల్లోకి ప్రజా సేవ కోసం వచ్చాను కానీ భూములు.. డబ్బు కోసం కాదని, నాలుగేండ్లల్లో ముఖ్యమంత్రి అయ్యింది చరిత్రలో ఎవ్వరూ లేరు.. నువ్వు (రేవంత్) అయినావు అని వీహెచ్‌ అన్నారు.

Mahesh Kumar Goud : దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారు..

అంతేకాకుండా..’బీసీ కులగణన ను రేవంత్ చేయాలి.. పెద్ద బాధ్యత సీఎం పైన ఉంది.. కులగణన బాధ్యత రేవంత్.. మహేష్ కుమార్ పైన ఉంది.. ఇప్పుడుంతా హమీమూన్ పీరియడ్ నడుస్తుంది.. పాతవి మర్చిపో అన్న ఇప్పుడు మనమంతా ఒక్కటి అని దగ్గరకి వస్తున్నారు.. కొంచం మావి కూడా వినాలి.. రేవంత్ పక్కన చెప్పేటోళ్లు ఎక్కువయ్యారు.. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్ పాస్ అయ్యింది.. త్వరలోనే మనకు న్యాయం జరుగుతుంది.. త్వరగా బీసీ కులగణన చేస్తేనే మన నాయకుడు మాట్లాడగలడు.. మీ రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయలేదు అని అడుగుతారు.. కులగణన ఆలస్యం చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేడు..’ అని వీహెచ్‌ అన్‌నారు.

Bird Photographer of the Year 2024: కిటికీలను ఢీకొని 4వేల పక్షుల దుర్మరణం..ఫొటోకి అవార్డ్