NTV Telugu Site icon

V.Hanumantha Rao: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..

Vh

Vh

తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిశారు. జనగణన కుల ప్రాతిపదికన జరగాలని కోరారు. అలాగే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి.. కచ్చితంగా కుల ప్రాతిపదికన జనగణనపైన మోడీతో చర్చించాలని హనుమంతరావు కోరారు. తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జనగణన ప్రారంభించారని గుర్తు చేశారు.

Read Also: Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌లను కుల ప్రాతిపదికన జనగణన చేయాలని కోరడానికి కలిశానని తెలిపారు. బీసీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని అడిగానన్నారు. కర్నూలు దగ్గర పెదపాడు గ్రామానికి దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి.. ఆ ప్రాంతంలో స్మృతి వనం కట్టాలని వీహెచ్ పేర్కొన్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని వీహెచ్ ఆరోపించారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి.. చనిపోయినప్పుడు కూడా సొంత ఇల్లు లేదని అన్నారు. ఆయనకి న్యాయం జరగాలని వి.హనుమంతరావు కోరారు. రాజకీయలలో డబ్బులు సంపాదించడం ఒక సిస్టం అయ్యింది.. పవన్ చొరవ తీసుకోవాలి, సహకరించాలన్నారు. మరోవైపు.. జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి పవన్‌ని కోరుతున్నానన్నారు. ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు.

Read Also: Boat Ultima Prime, Ember Smartwatches: ప్రీమియం లుక్‌తో.. మార్కెట్‌లోకి బోట్ కొత్త వాచ్‌లు.. ధర తక్కువే!