Site icon NTV Telugu

V.Hanumantha Rao : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తా

Vh

Vh

సముద్రంలో ఈత కొట్టే సమయం ఉంది మోడీకి కానీ.. మణిపూర్ వెళ్లే సమయం మాత్రం లేదని మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడి మీ అయ్య జాగిరా అంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని కూడా గుడిలోకి పోకుండా అడ్డుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఖమ్మం నుండి పోటీ చేస్తానని, అక్కడి సమస్యలపై కోట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన రైతులకు సాయం చేసిన అని ఆయన తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీసీ లకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు న్యాయం చేయాలన్నారు వీహెచ్‌. బీసీ కులగణన అన్నారు..బీసీలకు టికెట్ ఇవ్వారా..? బీసీలు ఓట్లు వేసి యంత్రాలమా..? అని ఆయన ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఏం కావాలి అని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది అని అందరు వచ్చి చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్..నేను తప్పా రాష్ట్రం అంతా తిరిగినమని, చాలా మందిని నేను నాయకుల ను తయారు చేసిన అని, పాపులారిటీ లో.. రేవంత్ తర్వాత నేనే అని ఆయన అన్నారు.

అనంతరం.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూలు పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ ఎత్తిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎత్తిపోయిందని బెంబేలెత్తి రేవంత్ పై నోరు పారేసుకున్నారన్నారు. పదేళ్లు యువరాజుగా రాజ్యాన్ని ఏలి ఆర్థిక వ్యవస్థలో చిన్నాభిన్నం చేశాడు కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. రేవంత్ కాంగ్రెస్ తీస్మార్ ఖాన్ అని ప్రజలే నిర్ణయించారన్నారు. ప్రజలు ఎవడు నిన్ను పిలవలేదని, నీ పార్టీ అంతరిక్షం లోకి వెళ్ళిందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. ఇంకో 24 ఏండ్లు అయినా.. మీ కారు సర్వీసింగ్ షేడ్ నుండి బయటకు రాదని వ్యాఖ్యానించారు. రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే.. నువ్వు..నీ అయ్యా..బావ ఓడిపోయే వాళ్ళు అని ఆయన అన్నారు. .ఓటమి నైరాశ్యం లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అందే శ్రీ దళితుడు అని ఆయన రాసిన గీతం రాష్ట్ర గీతంగా గుర్తించలేదు.
నీ బాషా..పదజాలం సోయిలో ఉండి మాట్లాడండి అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version