ఖమ్మం వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర ముగింపు సభలో వి.హెచ్.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ నే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సోనియాగాంధీని, రాహుల్ గాంధీని జైల్లో పెడదామని చూస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. పోడు భూములల్లో వ్యవసాయం చేయకుండా చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని, మీరు కళ్ళుండి చూడలేకపోయ్యారని, మీరు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అన్నాడు..అల్లుడు అన్నాడు అమ్మ అన్నాడు ఏం చేశావ్ కేసీఆర్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేశారని, మతోన్మాదలు బీజేపీ ప్రభుత్వం రెచ్చగొడుతుందన్నారు.
కేసీఆర్ అబద్దాలు చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, అభివృద్ధి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రెండు సార్లు ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చిన వదులుకుంది సోనియా గాంధీ..ఇప్పుడు జైల్లో పెడదామని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, అందరం కలిసి ఉంటాం కలుపుకొని పని చేస్తాం కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. అన్ని కులమతాలు వారు కలిస్తేనే స్వతంత్ర వచ్చిందని, ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో వివరించండన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రుణం తీర్చుకోవటానికి కాంగ్రెస్ ను గెలిపించుకుందామన్నారు.